పాపం.. ‘దేవదాస్’ దర్శకుడి ఇమేజ్ డ్యామేజ్ అయ్యింది !!
యువ దర్శకులు ఇమేజ్ డ్యామేజ్ కాకుండా చూసుకోవడం మంచింది. అది చాలా అవసరం కూడా. స్టార్ దర్శకుడిగా ఎదగాలంటే క్రమంగా ఇమేజ్ ని పెంచుకుంటూ వెళ్లాలి. అది వాళ్లు చేసే సినిమాల వల్ల వస్తోంది. ఐతే, ఆ సినిమా చేసే సమయంలో మన బద్దకం ఎదుటి వారికి కనిపించకూడదు. ‘దేవదాస్’ షూటింగ్ లో దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య బద్దకం మాత్రం కనిపించింది.
ఆ బద్దకాన్ని గురువారం జరిగిన దేవదాస్ ఆడియో వేడుక వేదికగా నాగ్, నానిలు బయటపెట్టారు. ఈ సందర్భంగా ప్లే చేసిన ప్రోమోలో నాని శ్రీరామ్ ఆదిత్య బద్దకంపై కామెంట్ చేశాడు. ఇక, నాగ్ ఏకంగా తన ప్రసంగంలోనే శ్రీరామ్ ఆదిత్య లేజీ ఫెలో అంటూ స్టేట్ మెంట్ ఇచ్చేశాడు. రేపు ‘దేవదాస్’ హిట్టైనా.. ప్లాపైనా.. ఈ బ్యాడ్ ఇమేజ్ ఇండస్ట్రీలో వినిపిస్తూనే ఉంటుంది.
రేపటి రోజున శ్రీరామ్ ఆదిత్య ప్లాపుల్లో ఉన్నప్పుడు.. అతడి అవకాశాలు ఇవ్వాలంటే ఇలాంటి బ్యాడ్ టాక్ మరింత సమస్యగా మారొచ్చు. ఇప్పటికైనా ఈ యువ దర్శకుడు ఇమేజ్ డ్యామేజ్ కాకుండా బద్దకాన్ని వీడితే మంచిదేమో.. ! ఇది ఉచిత సలహా మాత్రమే. ఈ విషయం పక్కన పెడితే ‘దేవదాస్’లని అదిరిపోయేలా ముస్తాబు చేశాడట.. ఈ దర్శకుడు. థియేటర్స్ నవ్వులే నవ్వులు అంటున్నారు.