ఎన్టీఆర్ సినిమా.. నిర్మాతగా చరణ్ !

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, నిర్మాతగానూ రాణిస్తున్న సంగతి తెలిసిందే. ‘కొణిదెల ప్రొడక్షన్స్’ బ్యానర్ పై తొలి చిత్రంగా మెగాస్టార్ చిరంజీవి “ఖైదీ నెం.150” నిర్మించారు. అది బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. మెగాస్టార్ 151 చిత్రం ‘సైరా’కి కూడా రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఐతే, బయటి హీరోలతోనూ సినిమాలు నిర్మించాలని చరణ్ అనుకొంటున్నారు.

ఈ నేపథ్యంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాని చరణ్ నిర్మించబోతున్నట్టు తెలిసింది. ఇప్పటికే చరణ్-తారక్ ల మధ్య చర్చలు కూడా జరిగాయట. ఐతే, చరణ్ నిర్మించబోయే తారక్ సినిమా వివరాలు మాత్రం ఇంకా తెలిసిరాలేదు. ఇక, వీరిద్దరు కలిసి రలో రాజమౌళి దర్శకత్వంలో భారీ మల్టీస్టారర్ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే.