‘నోటా’ కొత్త రిలీజ్ డేట్

సెన్సేషనల్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న పొలిటికల్‌ థ్రిల్లర్‌ మూవీ ‘నోటా’. పెళ్లి చూపులు, అర్జున్‌ రెడ్డి, గీత గోవిందం లాంటి సూపర్‌హిట్‌ల తరువాత తెరకెక్కుతున్న ఈ సినిమాతో విజయ్‌ కోలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఆనంద్‌ శంకర్‌ దర్శకుడు.

ఈ సినిమా రిలీజ్ విషయంలో విజయ్ పోల్ నిర్వహించారు. ‘నోటా’ రిలీజ్ డేట్ విషయంలో చాలా డ్రామాలు జరుగుతున్నాయి. నా సినిమాను మీరు ఎప్పుడు రిలీజ్ చేయమంటే అప్పుడే చేస్తాను” అంటూ ఓ పోల్ పెట్టారు విజయ్. దీనికోసం 4 ఆప్షన్లు ఇచ్చారు. అక్టోబర్ 5, అక్టోబర్ 10, అక్టోబర్ 18 మూడు ఆప్షన్లు కాగా నాలుగో అప్షన్ ‘నోటా'(ఏదీ వద్దు) అని ఇచ్చారు. ఈ పోల్ ఫలితం ఆధారంగానే సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తామని విజయ్ స్పష్టం చేశారు.

ఇప్పుడీ పోల్ రిజల్ట్ ని విడుదల చేశారు విజయ్. “మీరు నోటాకు ఓటేశారు. మీరు ‘అక్టోబర్ 5’కు ఓటేశారు’ అని ట్విట్ చేశారు విజయ్. దీంతో.. ప్రేక్షకులు చెప్పిన అక్టోబర్ 5న నోటాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు చెప్పకనే చెప్పాడు.