మోత్కుపల్లి కాళ్ల బేరం

‘అందితే జుట్టు.. లేదంటే కాళ్లు’ అనే సామెత వినే ఉంటాం. ఇప్పుడీ సామెతనే ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది.. సీనియర్ రాజకీయ నాయకుడు మోత్కుపల్లి. తెలంగాణ ఉద్యమ సమయంలో, ప్రత్యేక తెలంగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా మోత్కుపల్లి కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ప్రజలని కేసీఆర్ మోసం చేస్తున్నాడన్నట్టుగా మాట్లాడారు.

క్రమంగా ఆయన మాట తీరు మారింది. కేసీఆర్ ని మచ్చిక చేసుకొనేలా కనిపించాడు. ఏకంగా టీ-టీడీపీ టీఆర్ ఎస్ లో విలీనం చేయాలనే ప్రతిపాదనని తెరపై తీసుకొచ్చారు. ఈ వ్యాఖ్యలతో ఆయన్ని టీడీపీ దూరం పెట్టింది. ఏకంగా పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేసింది. ఈ పరిణామల నేపథ్యంలో మోత్కుపల్లి వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుని దెబ్బకొట్టడమే లక్ష్యంగా పెట్టుకొన్నారు.

ఇక, ఇప్పుడు తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో మోత్కుపల్లిని ఏ పార్టీ చేర్చుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలో ఆయన స్వత్రంత్య్ర అభ్యర్థిగా ఆలేరు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతానని ప్రకటించారు. కానీ, గెలుస్తాననే నమ్మకం కలగడం లేనట్టుంది. కేసీఆర్ వద్దకు కాళ్ల బేరానికి వచ్చారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్.. తనను వాడుకుంటే, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న 12 సీట్లనూ గెలిపించి టీఆర్ఎస్ చేతిలో పెడతానని బంపర్ ఆఫర్ ఇచ్చారు. మరీ.. ఆఫర్ ని కేసీఆర్ స్వీకరిస్తాడో.. ? లేదో.. ?? చూడాలి.