మెగాస్టార్’ని చంపడం.. ప్లాన్ మారింది !

మెగాస్టార్ చిరంజీవి చంపేస్తే ప్రేక్షకులు తట్టుకోగలరా.. ? అది తెరమీదైనా సరే. అందుకే చిరుని చంపేసే ప్లాన్ మార్చేశారట. మెగాస్టార్ నటిస్తున్న 151 చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. తొలి తరం స్వాత్రంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రమిది. వాస్తవక కథ ప్రకారం.. బ్రిటిష్ సైన్యం నరసింహరెడ్డిని ఊరితీసి ఆయన తలని కోట గుమ్మానికి వేలాడి తీసింది. సినిమా క్లైమాక్స్ లోనూ ఈ సీన్ చూపించాల్సి ఉంటుంది.

మెగాస్టార్ చిరంజీవి చంపేయడం అంటే మాటలు కాదు. దాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేరు. ఈ నేపథ్యంలోనే ‘సైరా’ క్లైమాక్స్ లో చిత్రబృందం మార్పులు చేస్తుందట. నరసింహ రెడ్డి చావుని చూపించకుండా.. ఆయన స్పూర్తితో మళ్లీ ఎవరెవరు తిరుగుబాటు చేశారనే అంశాల ఆధారంగా క్లైమాక్స్ ని ప్లాన్ చేశారట. ఈ ఏపీసోడ్ లో అల్లూరి సీతారామరాజు కాలం నాటి విప్లవకారులని ప్రస్తావించబోతున్నారు. అది స్పూర్తివంతంగా.. సినిమా చూసిన ప్రేక్షకుడు సంతృప్తి చెందే విధంగా ఉండనుందట.

‘సైరా’కు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. చిరు సరసన నయనతార జతకట్టనుంది. బిగ్ బీ అమితాబ్, విజయ్ సేతుపతి, కిచ్చ సుధీప్, జగపతిబాబు, తమన్నా.. తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్ తో పాటు హిందీలోనూ విడుదల చేయనున్నారు. వచ్చే యేడాది వేసవిలో ‘సైరా’ విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.