పవన్ హత్యకు కుట్ర.. చంద్రబాబు స్పందన ఇది !

తనని హత్య చేసేందుకు కుట్ర జరుగుతోంది. దానికి సంబంధించిన వీడియో ఒకటి తన దగ్గరకి వచ్చిందని జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ హత్యకు ప్లాన్ చేసింది ఎవరై ఉంటారు ? వారెవరో తెలిసి కూడా పవన్ వారి పేర్లు ఎందుకు బయపటపెట్టడం లేదు ?? అన్నది చర్చనీయాంశంగా మారింది.

ఈ కుట్ర చేసింది వైసీపీకి చెందిన నేతలేనని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఆ అవసరం టీడీపీకి మాత్రమే ఉంది. ఆ పార్టీకి చెందిన నేతలే పవన్ హత్యకు కుట్ర చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా పర్యటనని ముగించుకొని వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పవన్ హత్య కుట్రపై ఆసక్తికరంగా స్పందించారు.

పవన్ కళ్యాణ్ కు ప్రాణహాని ఉందని చెబితే ప్రభుత్వం భద్రత కల్పిస్తుంది. అలా పవన్ బహిరంగంగా పదేపదే తనకు ప్రాణహాని ఉందని చెప్పడం సరికాదు. పోలీసు వ్యవస్థ మీద అందరికి నమ్మకం ఉండాలి. అవినీతి, హింస, అరాచకాలను సహించేది లేదని చంద్రబాబు అన్నారు. అలాంటి నమ్మకం ఉంటే ఇటీవల ఎమ్మెల్యే కిడారి మావోస్టుల చేతిలో ఎందుకు హతం అవుతాడని.. జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు.