ఐటీ దాడులపై విజయ్‌సేతుపతి క్లారిటీ
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు రేవంత్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఇలాంటి దాడులే కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి ఇంట్లో జరిగాయి. దీనిపై తమిళ మీడియాలో రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా, ఈ ప్రచారంపై విజయ్ సేతుపతి క్లారిటీ ఇచ్చారు. అసలు అవి ఐటీ సోదాలే కాదు. అది సర్వే మాత్రమేనని వివరణ ఇచ్చారు. మూడేళ్లుగా తాను ఇన్‌కంటాక్స్‌ను ముందుగానే చెల్లిస్తున్నా. ఐతే, దానికి సంబంధించిన రిటర్న్ దాఖలు చేయలేదు. దీంతో ఐటీ అధికారులు వచ్చి సర్వే చేసుకుని వెళ్లారని క్లారిటీ ఇచ్చారు.
ఇక, విజయ్ సేతుపతి-త్రిష జంటగా నటించిన చిత్రం “96”. ప్రేమ్‌కుమార్ దర్శకుడు. ఎస్.నంద గోపాల్ నిర్మాత. ఈ సినిమా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక రోజు రాత్రి జరిగే సంఘటనల ఇతివృత్తమే 96 చిత్రం కథ. ఇప్పటికే ఈ సినిమాని సినీ ప్రముఖులు చూసేశారు. ఈ సినిమా చూసిన దిల్ రాజు తెలుగు రైట్స్ ని కొనేశారు. ఈ రిమేక్ లో నాని-సమంత జంటగా నటిస్తారనే ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈ రిమేక్ కు సంబంధించిన పూర్తి వివరాలని వెల్లడిస్తానని దిల్ రాజు ట్విట్టర్ ద్వారా తెలిపారు.