‘దేవదాస్’ డిలీటెడ్ సీన్స్.. మీ కోసం !

‘దేవదాస్’లు నాగ్, నానిలు థియేటర్స్ లో సందడి చేస్తున్నారు. ప్రేక్షకులని నవ్వుల్లో ముంచేస్తున్నారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో మల్టీస్టారర్ చిత్రం ‘దేవదాస్’. ఇందులో నాగ్ దేవ్ డాన్ పాత్రలో, నాని దాసు డాక్టర్ పాత్రలో నటించారు. ఆకాంక్ష సింగ్, రష్మిక మందన హీరోయిన్స్. గతవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘దేవదాస్’ పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొంది. తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్ లోనూ మంచి కలెక్షన్స్ ని రాబడుతోంది.

తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన డిలీటెడ్ సీన్స్ ని నాని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. నివిడి కారణంగా తొలగించిన సీన్స్ ఇవి. కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో జరిగే మోసాల నేపథ్యంలో ఈ సన్నివేశాన్ని తెరకెక్కించారు. ఈ సీన్ లో “ఈ చేతులతో ఎన్ని బుల్లెట్లు తీశానో తెలుసా మీకు?” అంటూ ఉద్వేగంతో నాని చెప్పే డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది. ఆ సన్నివేశాలని మీరు ఓసారి చూసేయండీ.. !