లీక్ : మొబైల్స్ లో ‘టాక్సీవాలా’

‘అర్జున్ రెడ్డి’ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ నటించిన చిత్రాల్లో ‘టాక్సీవాలా’ ఒకటి. ‘గీత గోవిందం’ కంటే ముందే ‘టాక్సీవాలా’ విడుదల కావాల్సి వచ్చింది. కొన్ని కారణాల వల్ల టాక్సీవాలా విడుదల వాయిదా పడుతోంది. ఐతే, ఇప్పటికే ఈ సినిమా లీకైందనే వార్తలొచ్చాయ్. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు కూడా చేశారు.

ఇప్పుడీ సినిమా మొబైల్ ఫోన్స్ లో హల్ హల్ చేస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి లో కొంత మంది మొబైల్స్ లో టాక్సీవాలా ని చూస్తుండగా పోలీసులు గుర్తించి అరెస్టు చేసినట్టు తెలిసిందే. ఇప్పటికే ఆర్థిక కష్టాలతో ఈ సినిమా విడుదలకు నోచుకోవడం లేదు. అలాంటిది విడుదలకు ముందే మొత్తం లీకంటే.. టాక్సీవాలా పనైపోయినట్టే.