పవన్ సామాజిక తీవ్రవాది
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీవ్ర ఆరోపణలు చేశారు టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య. పవన్ సామాజిక తీవ్రవాదిలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తన హత్యకు కుట్ర జరిగింది. దాని గురించి ఓ ముగ్గురు మాట్లాకోవడం.. దానికి సంబంధించిన ఆడియో తన దగ్గరకు వచ్చింది. వారెవరో తనకు తెలుసని పవన్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వాళ్లెవరో పవన్ కు తెలిసినప్పుడు ఆయన పోలీసులకి ఎందుకు ఫిర్యాదు చేయలేదని వర్మ ప్రశ్నించారు. పవన్ పబ్లిసిటీ కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. అంతేకాదు.. సినీ నటులంతా సీఎంలు కాలేరని సటైర్ వేశారు వర్ల. మరీ.. వర్మ వ్యాఖ్యలపై పవన్ ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.