సోషల్ మీడియా మాటించిందట !
సోషల్ మీడియా మాటించిందట. ఎన్నికల సమయంలో తప్పుడు వార్తలు ప్రచారం కాకుండా తగిన జాగ్రత తీసుకొంటామని మాటించిందట. ఈ మేరకు ఎన్నికల ప్రధానాధికారి ఓపీ రావత్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలతో పాటు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం, ఛత్తీస్‌గఢ్‌లలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనరు ఉమేష్ సిన్హా సారథ్యంలోని సంఘం గూగుల్, ఫేస్బుక్, ట్విటర్ల ప్రాంతీయ సారధులతో సమావేశమయ్యారు. పోలింగ్ కు 48 గంటల ముందు నుంచీ తమ సామాజికమాధ్యమాలపై ఎన్నికల సంబంధ సమాచారాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమని పైన పేర్కొన్న సోషల్ మీడియా సారధులు మాటిచ్చారట. మరీ.. ఆ మాటని ఏ మేరకు నిలబెట్టుకొంటారన్నది చూడాలి.