కాజల్ డబుల్ యాక్షన్
ముద్దుగుమ్మ కాజల్ డబుల్ యాక్షన్ చేస్తుందట. ఐతే, అది సినిమాలో కాదు. నిజ జీవితంలో. అలాగని ఆమెకు పెళ్లి అయ్యింది. ఓ వైపు సినిమాలు, మరోవైపు సంసారం చేసుకుంటుంది అనుకోకండి. కాజల్ ప్లే చేస్తున్నడబుల్ రోల్ వేరు. ఆమె సినిమాలని, పర్సనల్ లైఫ్ ని భిన్నంగా చూస్తుందట.
“నటిగా నేనో రకం. ఇంట్లో నా రెండో అవతారం చూస్తారు. ఇంట్లో ఉండే కాజల్‌కీ, కెమెరా ముందుండే కాజల్‌కీ చాలా తేడా ఉంది. ఇంట్లో చాలా సాధారణమైన అమ్మాయిని. అమ్మానాన్న, నా స్నేహితులు ఉంటే చాలు. మరో ప్రపంచం అవసరం లేదు. చిన్న చిన్న విషయాలకే సంతోషపడిపోతుంటా. నాకంటూ పెద్ద కోర్కెలు ఉండవు. గడప లోపల నేనో సినిమా స్టార్ అనే సంగతి గుర్తుకు రాదు” అని చెప్పుకొచ్చింది.