పవన్ మరోసారి రహస్య పూజాలు !
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రహస్య పూజలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఆయన ఇవాళ తెల్లవారుజామున పశ్చిమగోదావరి జిల్లాలోని ఐఎస్.జగన్నాథపురంలో ఉన్న నరసింహస్వామి ఆలయంలో రహస్య పూజలు చేసినట్టు తెలిసింది. ఉదయం 3 గంటల నుంచి 4.30 వరకు ఈ పూజలు జరిగినట్టు తెలుస్తోంది.
ఈ విషయాన్ని ఆలయ అధికారులు లీకు చేయడంతో వైరల్ గా మారింది. గతంలో ఇదే ఆలయంలో పవన్ తాంత్రిక పూజలు నిర్వహించారనే మహేష్ కత్తి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఐతే, ఇప్పుడు కూడా పవన్ అదే ఆలయంలో తాంత్రిక పూజలు చేశారా.. ? లేదంటే అమృత గడియాల్లో నరసింహుడి దర్శనం చేసుకొన్నారా.. ? అన్నది తెలియాల్సి ఉంది.
మరోవైపు, పోలవరం ముంపు ప్రాంతాల్లో పవన్ పర్యటన కొనసాగుతూనే ఉంది. ఈరోజు పవన్ పోలవరం ముంపు మండలాలు వేలేరుపాడు, కుక్కునూరులలో పర్యటిస్తున్నారు. అక్కడి భూనిర్వాసితులతో ఆయన ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. కాగా, ఇటీవల తన హత్యకు కుట్ర జరుగుతుందని పవన్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.