విజయ్.. మరో ద్విబాష చిత్రం ఫిక్స్ !
యూత్ మెగాస్టార్ విజయ్ దేవరకొండ నటించిన తొలి ద్విబాషా చిత్రం ‘నోటా’. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ఈరోజు ముందుకొచ్చిన ‘నోటా’ పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొంది. అంతకు ముందు ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న విజయ్.. మరో ద్విబాషా చిత్రం చేయాల్సి ఉంది. ఐతే, దానిపై ‘నోటా’ ఫలితం తర్వాత నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. ఇప్పుడు ‘నోటా’ మంచి టాక్ రావడంతో.. ఆయన్ని నుంచి మరో ద్విబాషా చిత్రం రావడం దాదాపు ఖాయమైపోయినట్టే. ఆ సినిమా పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
ఇటీవలే ‘గీత గోవిందం’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొన్నాడు విజయ్. ఆ సినిమా ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఆ సినిమా హవా ముగియకముందే ‘నోటా’ ప్రమోషన్స్ లోకి దిగాడు. ఈ బిజీ జీవితంపై విజయ్ తనదైన శైలిలో స్పందించారు. సినిమాలు చేయాలనుకున్నాను. కానీ మరీ నిద్ర లేని రాత్రులు గడిపేంత బిజీ అవ్వాలనుకోలేదన్నారు. ప్రస్తుతం క్రాంతి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నా. ఇక, ఆయన నటించిన ‘టాక్సీవాల’ విడుదలకు రెడీగా ఉంది. ఐతే, ఇప్పటికీ ఈ సినిమా లీకవ్వడంపై విజయ్ ఆందోళన వ్యక్తం చేశారు.