చంద్రబాబు కోసం రంగంలోకి రేవంత్ !

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగినట్టు కనబడుతోంది. ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ చంద్రబాబుని టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. రాక్షసుడు చంద్రబాబు.. తెలంగాణకు పట్టిన శని. కేసీఆర్ మూడో కన్ను తెరిస్తే చంద్రబాబు గతి ఏమవుతుంది ? అంటూ ఘూటుగా విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై చంద్రబాబుతో సహా ఆ పార్టీ నేతలు ఎవ్వరు గట్టిగా కౌంటర్ ఇవ్వలేదు.

ఇప్పుడు చంద్రబాబు కోసం రేవంత్ రంగంలోకి దిగారు. తెలంగాణలో కాంగ్రెస్ తో పొత్తు కోసం చంద్రబాబు రూ. 500కోట్లు ఇచ్చాడు. దీంతో పాటు ఎన్నికల ప్రచారం కోసం మూడు హెలిక్యాప్టర్స్ రెడీ చేస్తున్నాడటని కేసీఆర్ విమర్శించిన సంగతి తెలిసిందే. దీనిపై రేవంత్ స్పందిస్తూ.. టీడీపీతో టీఆర్ ఎస్ పొత్తు పెట్టుకొన్నప్పుడు మీరు ఎంత ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. మొత్తంగా గురువు చంద్రబాబుని కేసీఆర్ విమర్శించడం రేవంత్ తట్టుకోలేకపోతున్నాడు. బహుశా.. ఆయన కాంగ్రెస్ లో చేరినా.. ఇంకా టీడీపీలోనే కొనసాగుతున్నట్టు భ్రమ పడుతున్నట్టున్నాడు.