రష్మిక పెద్ద దొంగ !

ఛలో, గీత గోవిందం, దేవదాస్ చిత్రాలతో హాట్రిక్ హిట్స్ ఖాతాలో వేసుకొంది రష్మిక మందన. ఈ లక్కీ హీరోయిన్ కోసం దర్శక-నిర్మాతలు క్యూ కడుతున్నారు. రష్మిక మాత్రం మంచి కథల కోసం వెయిట్ చేస్తోంది. చూడ్డానికి అల్లరిపిల్లలా కనిపించే రష్మిక మనసు చాలా సున్నితమట. ఇటీవలే రష్మిక ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్, సినిమా విశేషాలని పంచుకొంది. ఇందులో ఆమె చేసిన ఓ దొంగ పని నవ్వులు తెప్పిస్తోంది.
రష్మిక ఇంట్లో డబ్బులు దొంగతనం చేస్తుందట. ఐతే, అది చిన్నప్పడు. ఇంట్లో పది, ఇరవై రూపాయల నోట్లు తీసేసి మంచం కింద దాచేదట. అలా దొంగలించిన డబ్బులని ఆ తర్వాత దానం చేసేదట. దానం చేస్తే పుణ్యం వస్తుందనే నమ్మకంతో అలా చేసేదట. రష్మికకి పాటలంటే పిచ్చి. మూడ్‌కి తగ్గట్టు మెలోడీలు, విషాద గీతాలు, హుషారుగా ఉండే ఫాస్ట్‌ బీట్‌లు వింటుందట.