త్రిష బాగా తగ్గించేసింది !
త్రిష తన 12యేళ్ల కెరీర్’లో మిగిలిపోయిన కోరికలన్నింటినీ తీర్చుకుంటోంది. ఆమెకు సూపర్ స్టార్ రజనీకాంత్ నటించాలన్నది తీరని కోరిక. ఇప్పుడా కోరిక ‘పేటా’తో తీర్చుకుంటుంది. విజయ్ సేతుపతితో నటించాలనే కోరిక కూడా ఉండేదట. అది ’96’తో తీరింది. భారీ అంచనలా మధ్య ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ’96’ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత కూడా వరుస హిట్స్ తో దూసుకెళ్లాలని ఆశపడుతోంది.ఇందులో భాగంగా బాగా సన్నబడింది. నాజుక్కుగా తయారైంది. మునుపటి త్రిషలా సైజులు మార్చుకొంది. తాను మరో రౌండ్’కు రెడీ అంటూ బహిరంగంగానే ప్రకటించేసింది. ఈసారి సీనియర్స్ హీరోలతో రౌండ్ వేయాలని నిర్ణయించుకుందట. అంతేకాదు.. పారితోషకాన్ని భారీగా తగ్గించుకుందట. బహుశా.. ఇంకా యంగ్ హీరోలే కావాలంటే కష్టమనే విషయం త్రిషకు అర్థమైనట్టుంది. ప్రస్తుతం సీనియర్స్ హీరోయిన్స్ కరువైన వేళ.. వాళ్లని తాను ఓ మంచి ఆప్షన్ గా మారాలని డిసైడ్ అయినట్టు కనబడుతోంది.
ప్రస్తుతం త్రిష గర్జన, చతురంగవేట్టై-2, 1818, పరమపదం విళైయాట్టు, పేట్ట చిత్రాల్లో నటిస్తోంది. ఇక, ’96’ చిత్రాన్ని తెలుగులో దిల్ రాజు రిమేక్ చేయనున్నాడు. ఇప్పటికే రిమేక్ రైట్స్ ని తీసుకొన్నారు. ఈ రిమేక్ లో నాని-సమంత జంటగా నటించే అవకాశాలున్నట్టు ప్రచారం జరుగుతోంది. సామ్ కాదంటే తెలుగులోనూ త్రిష నటించే ఛాన్సుందని చెబుతున్నారు. త్వరలోనే ఈ రిమేక్ కు సంబంధించిన వివరాలని ప్రకటిస్తానని దిల్ రాజు ప్రకటించిన సంగతి తెలిసిందే.