’96’ పైరసీ దొంగ రెడ్‌హ్యాండెడ్
విజయ్ సేతుపలి – త్రిష జంటగా తెరకెక్కిన చిత్రం ’96’. ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించారు. 1996 నాటి ప్రేమకథా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ఫస్ట్ షోతోనే హిట్ టాక్ తెచ్చుకొంది. ఈ మధ్యకాలంలో వచ్చిన మంచి ప్రేమకథా చిత్రాల్లో ఇదొకటని ప్రశంసలు అందుకుంటోంది. ఐతే, తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి స్థానిక మినీ ఉదయం అనే థియేటర్లో ఈ సినిమాను తన ఫోనులో రికార్డు చేస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు.
ప్రముఖ నటుడు, నడిగర్ సంఘం అధ్యక్షుడు విశాల్‌కు చెందిన పైరసీ టీం సభ్యులు ఆయన్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని పోలీసులకి అప్పగించారు. చీకటిగా ఉన్న థియేటర్లో ఒక సీటు వద్ద ఫోన్ లైట్ వెలగడం గమనించిన వారు వెంటనే తమ ఫోన్లతో ఫొటోలు తీశారు. వెంటనే అతన్ని పట్టుకొన్నారు. తమిళనాడులో పైరసీను అరికట్టేందుకు విశాల్, అతని బృందం క్షేత్రస్థాయిలో కృషిచేస్తున్నారు. పైరసీ చేస్తున్న నిందితులను పట్టుకునేందుకు విశాల్ ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.
ఇక, ఈ సినిమా తెలుగు రైట్స్ ని నిర్మాత దిల్ రాజు తీసుకొన్నారు. అంతేకాదు.. ఈ చిత్రాన్ని నాచురల్ స్టార్ నానికి చూపించారు. ఆయనతో ’96’ రిమేక్ ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. హీరోయిన్ గా సమంతని అనుకొంటున్నారంట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ఇస్తానని దిల్ రాజు ఇప్పటికే తెలిపారు.