బూజు పట్టిన యాదాద్రి లడ్డూలు
తెలంగాణ తిరుపతి యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులకు పంపిణీ చేసేందుకు సిద్ధం చేసిన లడ్డూలు బూజు పట్టాయి. మొత్తం 1800 లడ్డూలు పాడైపోయాయి. దీంతో వాటన్నింటినీ అధికారులు పడేశారు. ప్రసాదాన్ని కొనుగోలు చేసిన ఓ భక్తుడు తినేందుకు లడ్డూను రెండు ముక్కలు చేయగా మొత్తం బూజు పట్టి కనిపించింది. దీంతో అతడు వెంటనే ఆలయ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో… ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు పరిశీలించగా.. 30 ట్రేలలో ఉన్న 1800 లడ్డూలను పారబోశారు. వీటి విలువ రూ.60 వేలు ఉంటుందని అధికారులు తెలిపారు.