నయన్ జాతకంలో ముఖ్యమంత్రి యోగం.. !?


స్టార్ హీరోయిన్ నయనతార ముఖ్యమంత్రి అవుతారట. ఆమె జాతకంలో ఆ యోగం ఉందట. అందుకే ఆమె హీరో శింబుని పెళ్లాడలేదు. ఒకవేళ శింబుని పెళ్లాడి ఉండి ఉంటే నయన్ రోడ్డున పడేదట. ఈ మేరకు ఓ జ్యోతిష్కుడు చెప్పాడట. అందుకే నయన్ శింబుని పెళ్లి చేసుకోలేదని దర్శకుడు జీటీ నందు చెబుతున్నారు. గతంలో నందు, శింబుకి సన్నిహిత వ్యక్తి కలిసి జ్యోతిష్కుడిని కలిశారట. ఆ జ్యోతిష్కుడే ఈ విషయం చెప్పాడట. బహుశా.. నయన్-శింబులు పెళ్లి చేసుకోకపోవడానికి ఇదే కారణం కావొచ్చని చెప్పుకొచ్చాడు జేటీ నందు. ఇందులో నిజమెంత ? అనేది తెలీదు. కానీ.. నందు కామెంట్స్ వైరల్ గా మారాయి.

ఇక, నయన్ లవ్ ఎఫైర్స్ గురించి తెలిసిందే. శింబుతో ఆమె పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది. వీరి రొమాన్స్ పిక్స్ ఇప్పటికీ హాటునే. శింబుతో బ్రేకప్ తర్వాత నయన్ ప్రభుదేవాతో ప్రేమలో పడింది. వీరి ప్రేమ వ్యవహారం చాన్నాళ్లే సాగింది. పెళ్లి వరకు వెళ్లింది. ఆఖరి నిమిషంలో పెళ్లిని క్యాన్సిల్ చేసుకొన్నారు. బ్రేకప్ చెప్పేసుకొన్నారు. ఈ ఏపీసోడ్ తర్వాత నయన్ సన్యాసిగా మారబోతుందనే ప్రచారం కూడా జరిగింది. కొత్త గ్యాప్ తర్వాత నయన్ యువ దర్శకుడు విఘ్నేష్ శివన్ ప్రేమలో పడింది. ప్రస్తుతం వీరు పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. వీలు చిక్కినప్పుడల్లా ఫారిన్ వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. ఆ టూర్స్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఐతే, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.

తమిళనాట జయలలిత ముఖ్యమంత్రిగా తనదైన ముద్ర వేశారు. తమిళ ప్రజల అమ్మగా మారింది. జయ బయోపిక్ తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. జయలలిత పాత్ర కోసం నయన్ పేరు కూడా వినిపిస్తోంది. ఇక, జయ మరణం తర్వాత తమిళ రాజకీయాల్లో అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే స్టార్స్ హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. కానీ, పక్తు రాజకీయ నాయకుల్లా తనదైన ముద్రని చూపించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో నయన్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి. దర్శకుడు జేటీ నందు చెప్పినట్టు ఆమె ముఖ్యమంత్రి అవుతారో.. దీనికి కాలమే సమాధానం చెప్పాలి.. మరీ.