#మీటూ ఎఫెక్ట్.. ఐటమ్ సాంగ్స్ బ్యాన్ !?
#మీటూ ఎఫెక్ట్ సినీ పరిశ్రమలో భారీ మార్పులు తీసుకొచ్చేలా కనబడుతోంది. సినిమాల్లోనూ మహిళలని మరింత గౌరవప్రదంగా చూపించే రోజులు రాబోతున్నాయి. ఈ క్రమంలో సినిమాలో ఐటమ్ సాంగ్స్ చెక్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రముఖ బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ తన సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ బ్యాన్ చేస్తున్నట్టు ప్రకటించారు. 2007లోనే కరణ్ ఈ నిర్ణయం తీసుకొన్నారు. #మీటూ ఎఫెక్ట్ తో మరికొందరు దర్శక-నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకొన్నట్టు తెలుస్తోంది. దర్శకుడు విశాల్ భరద్వాజ్ ‘పటాకా’ సినిమాలో మలైకా అరోరా మీద తీసిన ‘హెలో హెలో.. ’ ఐటమ్ సాంగ్ తొలగించేశారు. అందుకు గల కారణం ఏంటీ ? అన్నది చెప్పకపోయినా.. ఇది మంచి పరిణామం అని చెబుతున్నారు. మీటూ ఎఫెక్ట్ తో ఇకపై ఐటమ్ సాంగ్ సంఖ్య తగ్గొచ్చని చెబుతున్నారు. మరీ.. వాటినే నమ్ముకొని థియేటర్స్ కి ఐటమ్ ప్రియులకి ఈ పరిణామాలు నిరాశపరిచేవే.