టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో వచ్చేసింది

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ, ప్రతిపక్షాలకు అందనంత వేగంగా ఉరుకుతుంది. ఇప్పటికే 105స్థానాలకి టికెట్లు ఖరారు చేసిన టీఆర్ఎస్.. ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టోని కూడా ప్రకటించింది. మంగళవారం తెరాస భవన్ లో ఆ పార్టీ మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది. సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ పాక్షిక మేనిఫెస్టోని మీడియాకు వివరించారు. అది తెలంగాణ ప్రజలని మరింత ఖుషి చేసేలా ఉంది. దసరా పండగ వేళ టీఆర్ఎస్ మేనిఫెస్టోకి విస్తృత ప్రచారం దొరకనుంది.

టీఆర్ఎస్ మేనిఫెస్టో – ముఖ్యాంశాలు :

* రైతుబంధు కింద ఇచ్చే వ్యయాన్ని రూ. 10వేలకు పెంపు

* రూ.లక్ష రుణమాఫీ

* రుణ మాఫీ విషయంలో గతంలో తలెత్తిన సమస్యలు మళ్లీ తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటామని హామీ

* రైతు సమన్వయ సమితిలకు గౌరవ భృతి ఇవ్వాలని నిర్ణయం. అదెంత ? అనేది ప్రభుత్వం ఏర్పాటు తర్వాత నిర్ణయం

* పింఛను పొందేందుకు వయో పరిమితిని 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గింపు

* వృద్ధులకు ఫించన్ రూ.1000 నుంచి రూ.2016కు పెంపు

* వికలాంగులకు ఫించను రూ.1500 నుంచి రూ.3016కు పెంపు

* నిరుద్యోగ భృతి కింద యువతకు నెలకు రూ.3016 ఇచ్చేందుకు నిర్ణయం

* అగ్రవర్ణ పేదలకు ప్రత్యేక కార్పోరేషన్లు ఏర్పాటు

* వైశ్య కార్పోరేషన్‌ ఏర్పాటుచేసి కార్పస్‌ ఫండ్‌

* మహిళా సంఘాలకు ఫుడ్‌ ప్రాసెసింగ్‌యూనిట్లు ఏర్పాటు

* ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక పథకాల రూపకల్పన చేస్తామని కేసీఆర్ వెల్లడించారు.