రాహుల్ కు తలసాని సవాల్

మంత్రి తలసాని కాంగ్రెస్ కు సవాల్ విసిరాడు. అసలు తెలంగాణ కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో తెలియదు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు రాబోతున్నారు. ఆ సభలో సీఎం అభ్యర్థిని ప్రకటించే దమ్ముందా ? అని ప్రశ్నించారు తలసాని. నిజంగానే ఇది ప్రశ్న. ఎందుకంటే కాంగ్రెస్ లో సీఎం రేసులో డజనుపైగా నేతలు ఉన్నారు. వారు ఒకరినొకరు కాళ్లు క్రిందికి లాగే పనిలో ఉన్నారు. అది ఆ పార్టీ క్యాడర్ ని, ప్రజలని కన్పూజన్ లోకి నెటేస్తోంది.

అలాగని ముందే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించడం కాంగ్రెస్ సాంప్రదాయం కాదు. పార్టీ విజయం సాధిస్తే.. ఢిల్లీ నుంచి సీఎం అభ్యర్థి పేరు సీల్డ్ కవర్లో వస్తుంది. అప్పటి వరకు నేనే సీఎం అభ్యర్థినీ.. నేనే సీఎం అభ్యర్థినీ కొట్టుకు చావడమే. ఈ విషయం ప్రక్కన పెడితే.. తలసాని సవాల్ ని కాంగ్రెస్ స్వీకరిస్తుందా.. ? రాహుల్ హాజరయ్యే సభలో సీఎం అభ్యర్థిని ముందే ప్రకటించే ప్రయత్న ఏదైనా చేస్తుందా.. ?? అనేది చూడాలి.