బావని బాగానే వాడుకుంటోంది !

బాలీవుడ్‌ హీరోయిన్‌ పరిణీతి చోప్రా కాబోయే బావని బాగానే వాడుకుంటోంది. పెళ్లికి ముందే బావతో డీల్ మాట్లాడుకుంటోంది. తనకి కావాల్సింది, తాను అడిగింది ఇవ్వాల్సిందేనని పట్టుబడుతోంది. వచ్చే నెలలో ప్రియాంక చోప్రా – నిక్‌ జొనాస్‌ వివాహం జరగనున్న సంగతి తెలిసిందే. ఐతే, పెళ్లి వేడుకల్లో భాగంగా ‘జూతా చురానా’ ఆట ఆడతారు. ఇందులో భాగంగా పెళ్లి కొడుకు చెప్పులను మరదళ్లు దొంగిలించి దాచేస్తారు. డబ్బులు ఇస్తేనే చెప్పులు తిరిగిస్తారు. ఉత్తరాది పెళ్లి వేడుకల్లో ఈ ఆట తప్పసరిగా ఉంటుంది.

దీనికోసం బావతో ముందే డీల్ మాట్లాడుకుంటుందట పరిణీతి. ఏకంగా రూ. 32కోట్లు డిమాండ్ చేస్తుందట. నిక్ మాత్రం కేవలం 10 డాలర్లు మాత్రమే ఇస్తారనని అంటున్నారంట. ఐతే, ఇంకా డీల్ ఓకే కాలేదు. చర్చలు నడుస్తున్నాయ్ అంటోంది పరిణీతి. మరీ.. రూ. 32 కోట్లు కాకున్నా.. రూ. 25కోట్లపైనే బావ నుంచి వసూలు చేయాలనే పట్టుదలతో పరిణీతి ఉన్నట్టు తెలుస్తోంది. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ప్రియాంక, నిక్‌ పెళ్లి జరగనుందని సమాచారమ్. ఈ వేడుకకి అతి తక్కువ మంది అతిథుల ఆహ్వానించబోతున్నరంట.