విశాల్’తో ప్రేమలో కీర్తి సురేష్.. ?


కోలీవుడ్ లో కొత్త పుకారు పుట్టుకొచ్చింది. ‘పందెంకోడి 2’ కోసం విశాల్-కీర్తి సురేష్ జంటగా నటించారు. దసరా పండగ రోజున గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చిన రెండో పందెంకోడి పాజిటివ్ టాక్ తెచ్చుకొన్నాడు. విశాల్-కీర్తిల మధ్య కెమిస్ట్రీ బాగుందని కితాబిస్తున్నారు. సినిమాలోనే కాదు.. బయట కూడా వీరు రొమాన్స్ చేసుకొంటున్నట్టు సమాచారమ్. రెండో పందెంకోడి షూటింగ్ సమయంలో వీరిద్దరు బాగా దగ్గరయ్యారట. వీలు చిక్కినప్పుడల్లా ముచ్చట్లో మునిగిపోయేవారట.

కుదిరితే సరదగా బయటికి వెళ్లేవారట. ఇప్పుడు సినిమా షూటింగ్ పూర్తయి, విడుదలైనా.. వీరు రెగ్యూలర్ గా టచ్’లో ఉంటున్నారట. ప్రతిరోజు ఫోన్‌లో చాటింగ్ చేయడమో లేదంటే నేరుగా కలవడమో చేస్తున్నారట. ఇదంతా ప్రేమేనా లేదంటే సినిమా ప్రమోషన్’లో భాగమో అన్నది కొన్ని రోజులు ఆగితే తెలిసిపోనుంది. ఇక, విశాల్-వరలక్ష్మీ ప్రేమ వ్యవహారం తెలిసిందే. ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రచారం జరిగింది. ఐతే, ప్రేమ, పెళ్లి, బ్రేకప్ పై ఈ జంట ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు.

కీర్తి సురేష్ మాత్రం ఇప్పటివరకు ఎవరితోనూ ప్రేమలో పడినట్టు వార్తలు రాలేదు. తొలిసారి ఆమెను ఓ హీరోతో లింకుపెడుతూ ప్రచారం జరుగుతోంది. నిప్పులేనిదే పొగరాదుగా. విశాల్-కీర్తి సురేష్ ల మధ్య కూడా ఏదో ఉంది. అది స్నేహమా.. ? ప్రేమనా.. ? లేక సినిమా ప్రమోషన్స్ కోసం దగ్గర కావాల్సి వచ్చిందా.. ?? అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా.. గాసిప్ రాయుడుళ్లకి ఈ జంట పని కల్పించదని చెప్పవచ్చు.