పట్టుపడిన పది కోట్లు ఏ పార్టీవి ?
తెలంగాణలో ఎన్నికల వేళ భారీగా నగదు సరఫరా జరగనుంది. దీన్ని ముందే ఊహించిన పోలీసులు ఇప్పటికే విస్తృత తనిఖీలు చేయడం మొదలెట్టారు. ఏ ఒక్క వాహనాన్ని వదలడం లేదు. ఈ క్రమంలో ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో చేపట్టిన తనిఖీల్లో ఏకంగా రూ. 10 కోట్ల పట్టుబడ్డాయి. మహారాష్ట్ర నాగ్ పూర్ జిల్లా నుంచి హైదరాబాదుకు ఈ డబ్బుని తరలిస్తున్నారు. కారు కర్ణాటక రిజిస్ట్రేషన్ తో ఉంది. కారు డ్రైవర్ సర్వేశ్, వినోద్ శెట్టిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో ఈ పది కోట్లు ఏ పార్టీకి సంబంధించినది. ఎక్కడికి తరలిస్తున్నారు. దీని వెనక ఎవరెవరు ఉన్నారు అనే విషయాలు తెలియాల్సి వచ్చింది. ఇదీగాక, ఎవరైనా వ్యాపార నిమిత్తం ఈ డబ్బుని తీసుకెళ్తున్నారా.. ? అనేది తెలియాల్సి ఉంది. అదే నిజమైతే.. దానికి సంబంధించిన ఆధారాలని కోర్టుకు చూపిస్తే సరిపోద్ది. ఎన్నికల టైం కావడంతో ఆ పదికోట్లు పొలిటికల్ పార్టీకి సంబంధించినదే అయి ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో క్లారిటీ రానుంది.