అమృత్‌సర్‌లో ఘోర రైలు ప్రమాదం.. 50మంది మృతి !

పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. నవరాత్రి వేడుకల్లో భాగంగా స్థానికులు జోదా ఫటక్‌ ప్రాంతంలోని రైలు పట్టాలకు సమీపంలో రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా బాణసంచా కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. ఆ సమయంలో రెండు ట్రాక్‌లపైకి రైళ్లు ఎదురెదురుగా వచ్చి పట్టాలపై నిలుచుకున్న వారిపై దూసుకెళ్లడంతో 50 మందికి పైగా మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

ఈ ఘటన అందరిని షాక్ కి గురి చేస్తోంది. అసలు ఈ ప్రమాదానికి కారకులు ఎవరు ? రైల్వే అధికారులా.. ?? లేక రావణ ఖాండ నిర్వాహకులా ?? చర్చ జరుగుతోంది. అసలు రైల్వే ట్రాక్ పై ఇలాంటి కార్యక్రమం నిర్వహించడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇక,
ఈ ఘటనపై రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌, ఢిల్లీ సీఎం క్రేజీవాల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.