ప్రభాస్.. ఒకేసారి మూడు !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు డబుల్ దమాఖా కాదు ట్రిపుల్ దమాఖా రాబోతుందని చెప్పుకొంటున్నారు. ప్రభాస్ పుట్టినరోజు కానుకగా ఈ నెల 23న ప్రభాస్ రెండు గిఫ్టులు అందించబోతున్నాడు. ఆయన నటిస్తున్న రెండు చిత్రాలు ‘సాహో’ రెండో టీజర్ తో పాటు, రాథాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ప్రభాస్ ప్రేమకథ ఫస్ట్ లుక్ కూడా రాబోతుందని చెప్పుకొంటున్నారు. వీటితో పాటు ప్రభాస్ పెళ్లి ప్రకటన రాబోతుందని ప్రచారం జరుగుతోంది. దీంతో అక్టోబర్ 23 కోసం డార్లింగ్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరీ.. నిజంగానే ప్రభాస్ ఫ్యాన్స్ కి మూడు గిఫ్టులు అందిస్తారా.. ? లేదా.. ?? అనేది వేచి చూడాలి

ఇక, సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘సాహో’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. దాదాపు రూ. 300కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న చిత్రమిది. బాహుబలి రేంజ్ లో తెలుగు, తమిళ్, హిందీ బాషల్లో విడుదల చేయనున్నారు. ఇప్పటికే సగానికిపైగా షూటింగ్ పూర్తయ్యింది. ఈ సినిమాకు బ్రేక్ ఇచ్చి.. రాథాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా మొదలెట్టాడు ప్రభాస్. ఇదో ప్రేమకథా చిత్రమని.. స్వాత్రంత్య్ర కాలం నాటి ప్రేమకథని చెబుతున్నారు. ప్రభాస్ సరసన పూజా హెగ్డే జతకట్టనుంది. ఈ రెండు సినిమాలు కూడా వచ్చే యేడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.