‘సర్కార్’ హహ మొదలైంది


కోలీవుడ్ లో విజయ్-మురగదాస్’లది హిట్ కాంబో. వీరి కలయికలో వచ్చిన తుపాకి, కత్తి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఇతర బాషల్లోకి అనువాదం అయి అక్కడ విజయవంతం అయ్యాయి. ఈ నేపథ్యంలో విజయ్-మురగదాస్ కలయికలో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం ‘సర్కార్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. దసరా కానుకగా శుక్రవారం ఈ సినిమా టీజర్ ని విడుదల చేసింది చిత్రబృందం. ఇప్పుడీ టీజర్ హవా చూపిస్తోంది.

కేవలం కేవలం 35 నిమిషాల్లోనే 30 లక్షల వ్యూస్‌ దక్కించుకోవడం విశేషం.16 గంటల్లో 11 మిలియన్లకుపైగా వ్యూస్‌ వచ్చాయి. అంతేకాదు ట్విటర్‌ ట్రెండింగ్‌ టాప్‌లో ‘సర్కార్‌టీజర్‌’ హ్యాష్‌ట్యాగ్ చేరిపోయింది. దీనిపై విజయ్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఫ్యాన్స్‌‌ సందడిగా కేకలు వేస్తున్న వీడియోను మురుగదాస్‌ ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఆశ్చర్యంతో ‘దేవుడా’ అని ట్వీట్‌ చేశారు. ఈ సినిమాలో విజయ్‌ ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ సీఈవోగా కనిపించనున్నట్లు సమాచారమ్.

ఈ సినిమాలో కీర్తిసురేష్‌, వరలక్ష్మి శరత్‌కుమార్‌ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఎ.ఆర్‌.రెహమాన్‌ సంగీతం. సన్‌ పిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్‌ నిర్మిస్తున్నారు. ఇక, ఈ చిత్రాన్నితెలుగులో అశోక్‌ వల్లభనేని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే తెలుగు టీజర్ ని విడుదల చేయనున్నారు. దీపావఌ కానుకగా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.