తెలంగాణ బీజేపీ తొలి జాబితా సిద్ధం !

తెలంగాణ బీజేపీ అభ్యర్థులని ఖరారు చేసే పనిలో ఉంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆధ్వర్యంలోని రాష్ట్ర ఎన్నికల కమిటీ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇప్పుడీ కసరత్తు ఓ కొలిక్కి వచ్చింది. 20మందితో కూడిన తొలి జాబితా రెడీ అయినట్టు సమాచారమ్. ఇప్పటి వరకు 40 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధుల పేర్లపై స్పష్టత వచ్చినట్టు తెలిసింది. ఐతే, తొలి జాబితాగా 25 అభ్యర్థుల పేర్లతో కూడిన లిస్టుని రాష్ట్ర ఎన్నికల కమిటీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

తెలంగాణ భాజాపా తొలి జాబితాలోని అభ్యర్థుల వివరాలు :

* ముషీరాబాద్ – లక్ష్మణ్

* అంబర్ పేట్ – కిషన్ రెడ్డి

* ఖైరతాబాద్ – చింతల రామచంద్రారెడ్డి

* ఉప్పల్ – ఎన్.వి.ఎస్.ఎస్ ప్రభాకర్

* మల్కాజిగిరి – ఎన్. రామచందర్ రావు

* ఎల్బీ నగర్ – పేరాల శేఖర్ రావు

* సూర్యాపేట – సంకినేని వెంకటేశ్వరరావు

*మునుగోడు – జీ.మనోహర్ రెడ్డి

* భూపాలపల్లి – కీర్తిరెడ్డి

* పరకాల – విజయచంద్రారెడ్డి

* ముథోల్ – పి.రమాదేవి

* కల్వకుర్తి – ఆచారి

* కరీంనగర్ – బండి సంజయ్

* నిజామాబాద్ రూరల్ – కేశుపల్లి ఆనంద్ రెడ్డి

* ఆదిలాబాద్ – పాయల శంకర్

* తాండూరు – పటేల్ రవిశంకర్

* నారాయణపేట్ – రతంగ్ పాండురంగారెడ్డి

* పాలేరు – శ్రీధర్ రెడ్డి

* కామారెడ్డి – వెంకటరమణారెడ్డి

* పెద్దపల్లి – గుజ్జల రామకృష్ణారెడ్డి

* భద్రాచలం – కుంజా సత్యావతి

* అచ్చంపేట – ఎం మల్లేశ్వర్

* దేవరకద్ర – ఎగ్గాని నర్సింహులు

* పినపాక – డాక్టర్ సంతోష్

* దుబ్బాక – రఘనందన్ రావు